నితిన్ సినిమా నుంచి రష్మిక తప్పుకోవడానికి గల కారణమదేనా ??
హీరోయిన్ రష్మిక ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్‌గా ఫుల్ బిజీగా ఉంది.
'పుష్ప 2'తోపాటు పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.
అయితే ఈమె.. నితిన్ సినిమా నుంచి తప్పుకుందనే వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఇందులో నిజానిజాల సంగతి పక్కనబెడితే మరో కొత్త విషయం ఒకటి బయటకొచ్చింది.
ఈమెపై ఓ వ్యక్తి కుట్ర చేస్తున్నాడని అంటున్నారు.
అయితే కొన్నిరోజుల ముందు రష్మికని మేనేజర్ మోసం చేశాడని న్యూస్ వచ్చింది.
ఇది జరిగిన కొన్నాళ్లకు ఫ్రొఫెషనల్గా వీళ్లిద్దరూ విడిపోయారు.
అప్పుడు ఏం జరిగిందనేది పక్కనబెడితే.. ఇప్పుడు అతడే రష్మిక కెరీర్ ని దెబ్బ కొడుతున్నాడని అంటున్నారు.
రష్మికకు తెలుగుపై పెద్దగా ఆసక్తి లేదని అందరీ దగ్గర చెబుతున్నాడట.
ఈ కారణంగానే నితిన్ ప్రాజెక్ట్ నుంచి ఈమె తప్పుకొందని అంటున్నారు.
ఈ మొత్తం వ్యవహారంపై స్వయానా రష్మిక స్పందిస్తే గానీ అసలు విషయం బయటపడదు.
ఇక్కడ క్లిక్ చేయండి