21 January 2024

ఆయనే నంబర్‌ వన్‌ ఆర్టిస్ట్‌.. ఆ హీరో కోసమే సినిమా ఒప్పుకున్నా: రష్మిక

TV9 Telugu

Pic credit - Instagram

ప్రస్తుతం దక్షిణాది చిత్ర పరిశ్రమలోని టాప్‌ హీరోయిన్లలో నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా ఒకరు

ఓవైపు సౌత్‌ ఇండస్ట్రీ, మరోవైపు బాలీవుడ్‌లలో వరుసగా సినిమాలు చేస్తూ బిజిబిజీగా ఉంటోందీ అందాల తార

పుష్ప, యానిమల్‌ సినిమాలు రష్మిక క్రేజ్‌ను అమాంతం పెంచాయని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు

ప్రస్తుతం ధనుష్‌, నాగార్జున కాంబినేషన్‌లో వచ్చే మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది

టాలీవుడ్‌ ఫీల్‌గుడ్‌ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న శేఖర్‌ కమ్ముల ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు

ధనుష్‌ సరసన నటించేందుకు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు రష్మిక మందన్నా పేర్కొంది

ధనుష్‌ సార్‌ మంచి నటుడని, తనతో స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటే చాలా నేర్చుకోవచ్చని తెలిపింది రష్మిక

ధనుష్‌ సరసన నటించే ఆరోజు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తునంటోందీ నేషనల్‌ క్రష్‌