ఏడవాలా... కొట్టాలా? ఏదో ఒకటి చెప్పమంటున్న రష్మిక!

TV9 Telugu

12 March 2024

అమ్మాయిలు అంత ప్రతినెల వచ్చే తమ నెలసరి గురించి ఎవ్వరికి చెప్పకుండా దాచిపెట్టే రోజులు పూర్తిగా పోయాయి.

ఇప్పుడు ఏదైనా దేని గురించైనా ఓపెన్‌గా మాట్లాడుకోవాల్సిందే. స్త్రీలు తమ నెలసరి ఓపెన్‌గా డిస్కస్‌ చేయాల్సిందే.

పీరియడ్స్ సమయంలో తాను చేసిన డ్యాన్సుల గురించి, ఇంటికొస్తే తండ్రి కాళ్లు పట్టడం గురించి ఆ మధ్య మాట్లాడారు సాయిపల్లవి.

ఇప్పుడు దీనిపై మాట్లాడానికి నేషనల్ క్రష్ రష్మిక మందన్న వంతు వచ్చింది. తాజాగా ఈ విషయంపై మాట్లాడారు ఈ బ్యూటీ.

పీరియడ్‌ పెయిన్‌ విపరీతంగా ఉందని సోషల్‌ మీడియా వేదికగా ఓపెన్‌ అయ్యారు స్టార్ కథానాయక రష్మిక మందన్న.

ఆ ఇరిటేషన్‌తో ఎవరినైనా కొట్టాలా? లేకుంటే ఐస్‌క్రీమ్‌లాంటిది తినాలా? అంటూ ప్రశ్నలు గుప్పించారు ఈ వయ్యారి.

ఏదైనా సినిమాగానీ, షోగానీ చూసి కాస్త మైండ్‌ డైవర్ట్ చేసుకోవచ్చా? అని... తనవైపున్న ఆప్షన్లన్నీ ఇస్తూ ఆడియన్స్ ని ఎంగేజ్‌ చేశారు రష్మిక.

సోషల్ మీడియాలో రష్మిక చేసిన పోస్ట్ చూసిన వారంతా ఎవరికి తోచిన సలహాలు వాళ్లు ఇస్తున్నారు నేషనల్‌ క్రష్‌కి.