TV9 Telugu
అందుకే మిస్ అయ్యా! రష్మిక.. అందుకే ఓకే చేశా! కియారా..
27 Febraury 2024
యానిమల్ మూవీతో సూపర్ హిట్ అందుకున్న రష్మిక మందన్న ఆ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్‌లో మాత్రం కనిపించలేదు.
దీంతో ఆ మూవీ టీమ్‌తో రష్మికకు గొడవ జరిగిందా అన్న అనుమానులు వచ్చాయి. తాజాగా ఈ వార్తలపై స్పందించింది రష్మిక.
సినిమా రిలీజ్ అయిన మరుసటి రోజు నుంచే మరో మూవీ షూటింగ్‌లో పాల్గొనాల్సి రావటంతో.. సెలబ్రేషన్స్‌లో పాల్గొనలేదని క్లారిటీ ఇచ్చింది.
ప్రజెంట్ బాలీవుడ్ మూవీస్‌లో ఉన్న హీరోయిన్స్ క్యారెక్టర్స్ గురించి స్పందించారు సీనియర్ నటి కరీనా కపూర్.
కంగనా రనౌత్, విద్యా బాలన్, దీపిక పదుకోన్ లాంటి తారలు క్యారెక్టర్స్, రెమ్యూనరేషన్స్ విషయంలో చాలా మార్పులు తీసుకువచ్చారని చెప్పారు.
యాక్షన్ మూవీ డాన్ మూడో భాగంగా వస్తున్న డాన్ 3లో అవకాశం రావటంపై హర్షం వ్యక్తం చేసింది నటి కియారా అద్వానీ.
ఇప్పటి వరకు ఎక్కువగా గ్లామర్ రోల్స్ మాత్రమే చేశా అన్న కియారా, ఫస్ట్ టైమ్ యాక్షన్ మూవీ చేసే ఛాన్స్ వచ్చిందని హ్యాపీగా ఫీల్ అవుతుంది.
ఈ సినిమాలో తాను కూడా హీరోతో సమానంగా యాక్షన్ సీన్స్‌లో కనిపించబోతున్నానని చెప్పారు. అందుకోసం ప్రత్యేక శిక్షణ తీసుకొంటుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి