TV9 Telugu
18 February 2024
చావు నుంచి తప్పించుకున్నా.! నేషనల్ క్రష్ రష్మిక పోస్ట్ వైరల్.
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవలే యానిమల్ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకుంది.
ఇప్పుడు పుష్ప 2, గర్ల్ ఫ్రెండ్ సినిమాల్లో నటిస్తుంది. అలాగే అటు హిందీలోనూ మరిన్ని ఆఫర్స్ అందుకుంటుంది.
తమిళం, తెలుగు, హిందీ భాషల్లో మూవీస్ చేస్తూ బిజీగా ఉన్న ఈ నేషనల్ క్రష్.. తాజాగా తన ఇన్ స్టా స్టోరీ చూసి అభిమానులు ఉలిక్కిపడ్డారు.
ఇంతకీ అంతగా అభిమానులు కలత చెందేట్లుగా రష్మిక ఏం పోస్ట్ పెట్టారు అనుకుంటున్నారా .? తన పోస్టుతో ఫ్యాన్స్ కు షాకిచ్చింది ఈ బ్యూటీ.
కొద్దిలో చావు నుంచి ఎలా తప్పించుకుందో రాసుకొచ్చింది. అసలేం జరిగిందంటే.. ఆమె ప్రయాణిస్తున్న ఫైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది.
అదే ఫ్లైట్ లో రష్మికతోపాటు మరో హీరోయిన్ శ్రద్ధా దాస్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరు కలిసి ఫ్లైట్ లో కూర్చున్న ఫోటోను షేర్ చేసింది రష్మిక.
తాజా సమాచారం ప్రకారం రష్మిక, శ్రద్ధా దాస్ కలిసి ప్రయాణిస్తోన్న విమానం ముంబై నుంచి హైదరాబాద్ కు ప్రయాణిస్తోందని తెలుస్తోంది.
అయితే ఫ్లైట్ లో సాంకేతిక సమస్య కారణం టేకాఫ్ అయిన 30 నిమిషాల తర్వాత తిరిగి మళ్లీ ముంబైలో ఎమర్జెన్సీ ల్యాండ్ అయ్యింది.
ఇక్కడ క్లిక్ చేయండి