11 October 2025

ఉదయాన్నే కచ్చితంగా ఆ రెండు పనులు.. రష్మిక డైట్ సీక్రెట్ ఇదే..

Rajitha Chanti

Pic credit - Instagram

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం హిందీ, తెలుగు భాషలలో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటూ ఫుల్ జోష్ మీదుంది.

యానిమల్, పుష్ప 2, ఛావా, కుబేర వంటి చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ క్రియేట్ చేసిన రష్మిక.. ఇప్పుడు థామా, మైసా, గర్ల్ ఫ్రెండ్, రెయిన్ బో చిత్రాల్లో నటిస్తుంది.

 మరోవైపు వచ్చే ఏడాది హీరో విజయ్ దేవరకొండతో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రష్మిక గురించి తెగ సెర్చ్ చేస్తున్నారు. 

రష్మిక వయసు ప్రస్తుతం 29 సంవత్సరాలు. ఈ బ్యూటీ పూర్తిగా శాఖాహార ఆహారాన్ని మాత్రమే అనుసరిస్తుంది. అలాగే రోజూ ఉదయాన్ని 1 లీటరు నీరు తీసుకుంటుదట. 

అలాగే ఆపిల్ సైడర్ వెనిగర్ సైతం తీసుకుంటుంది. ఇది జీర్ణక్రియను, జీవక్రియను పెంచడానికి సహయపడుతుంది. ఉదయం లేవగానే ఎక్కువగా నీరు తాగుతుందట. 

ప్రతిరోజు వ్యాయమం తర్వాత కచ్చితంగా గుడ్లు తింటానని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అవకాడో టోస్ట్ తీసుకుంటానని వెల్లడించింది రష్మిక. 

మధ్యాహ్న భోజనంలో దక్షిణాది వంటకాలనే తీసుకుంటానని.. అలాగే డిన్నర్ కూడా ఎప్పుడూ తేలికపాటి ఆహారం తీసుకుంటానని.. జాగ్రత్తగా ఉంటానని చెప్పుకొచ్చింది. 

టామోటాలు, బంగాళదుంపలు, దోసకాయ, క్యాప్సికమ్ వంటి కూరగాయలకు తనకు ఎలర్జీ ఉందని చెప్పుకొచ్చింది. చిలగడదుంప తినడం చాలా ఇష్టమని తెలిపింది.