అభిమానుల నుంచి రష్మికకు ఊహించని రిక్వెస్ట్.. ఎందుకు అడిగారబ్బా?

TV9 Telugu

28 May 2024

పుష్ప సినిమాతో నేషనల్‌ క్రష్‌గా మారిపోయింది కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా. ఆ తర్వాత యానిమల్ మూవీతో మరో పాన్ ఇండియా మూవీని ఖాతాలో వేసుకుంది.

ప్రస్తుతం రష్మిక చేతిలో ఉండేవన్నీ పాన్ ఇండియా సినిమాలు, భారీ ప్రాజెక్టులే. పుష్ప 2, కుబేర, సల్మాన్ సినిమాలోనూ రష్మిక నటిస్తోంది. 

రష్మికకు సౌత్‌తో పాటు నార్త్‌లోనూ భారీగానే అభిమానులు ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా రష్మిక ఢిల్లీ ఫ్యాన్స్‌ చేసిన రిక్వెస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది

ఇటీవల ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన రష్మిక ఎంచెక్కా తెలుగులో మాట్లాడి ఇక్కడి అభిమానులను ఆకట్టుకుంది. కానీ నార్త్ ఫ్యాన్స్ మాత్రం ఫీలయ్యారు.

దీంతో నార్త్ ఫ్యాన్స్ కోసం అప్పుడప్పుడైనా ఇంగ్లిష్ లో మాట్లాడాలని, దీంతో తమకు కూడా మీ తియ్యటి మాటలు అర్థమవుతాయని రష్మికకు రిక్వెస్ట్ పంపించారు

దీనికి రష్మిక మందన్నా సైతం స్పందించింది. 'దక్షిణాదితో పాటు మీలాంటి ఫ్యాన్స్‌ కోసం ఇంగ్లీషులో మాట్లాడేందుకు నేను నా వంతు ప్రయత్నం చేస్తా' అని రిప్లై ఇచ్చింది.

 ' సాధారణంగా చాలామంది వారి స్థానిక భాషలోనే మాట్లాడాలని కోరుకుంటారు.  నేను కూడా వారి భాషపై ఉన్న గౌరవంతో అలా మాట్లాడుతాను' అంది రష్మిక.

ప్రస్తుతం ఢిల్లీ అభిమానులు, రష్మిక చాట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని బట్టి రష్మిక క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.