01 November 2025

ది గర్ల్ ఫ్రెండ్ సినిమాకు రష్మిక రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..

Rajitha Chanti

Pic credit - Instagram

ప్రస్తుతం పాన్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రష్మిక మందన్నా. తెలుగు, హిందీ భాషలలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది.

ఇప్పటికే ఛావా, కుబేర, థామా చిత్రాలతో వరుసగా హిట్స్ అందుకున్న ఈ అమ్మడు.. ఇప్పుడు ది గర్ల్ ఫ్రెండ్ సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు రాబోతుంది.

ఈ చిత్రాన్ని నవంబర్ 7న విడుదల చేయనున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొంటుంది.

అయితే ఈ సినిమా కోసం రష్మిక ఎంత రెమ్యునరేషన్ తీసుకుందనే విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఇంతకీ ఆమె ఎంత తీసుకుంటుందంటే..

ప్రస్తుతం ఒక్కో సినిమాకు రష్మిక రూ.10 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుంది. ఇప్పుడు ది గర్ల్ ఫ్రెండ్ సినిమాకు సైతం భారీగానే వసూలు చేసిందట.

నివేదికల ప్రకారం ఈ చిత్రానికి రష్మిక ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోకుండానే నటించిందని.. అందుకే తనకు కృతజ్ఞతతో రెట్టింపు ఇస్తున్నారట మేకర్స్.

ఈ సినిమాకు రష్మికకు రెట్టింపు రెమ్యునరేషన్ ఇస్తున్నట్లు నిర్మాత ధీరజ్ మొగిలినేని అన్నారు. దీంతో రష్మిక వర్క్ డెడికేషన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ప్రస్తుతం ది గర్ల్ ఫ్రెండ్ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న రష్మిక.. త్వరలోనే టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండతో కలిసి పెళ్లి పీటలెక్కనున్న సంగతి తెలిసిందే.