18 June 2024
నయన్ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్..
Rajitha Chanti
Pic credit - Instagram
సౌత్ ఇండస్ట్రీలో ఇప్పుడు చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్న హీరోయిన్ రష్మిక మందన్నా. తెలుగు, హిందీలో నటిస్తుంది.
ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన పుష్ప 2లో నటిస్తుండగా.. ఇంకా గర్ల్ ఫ్రెండ్, రెయిన్ చిత్రాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే.. తాజాగా రష్మికకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరలవుతుంది. రష్మిక నయనతార కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటుందని టాక్.
తాజాగా ఈ బ్యూటీ సల్మాన్ ఖాన్ సరసన కనిపించనుంది. సల్మాన్ కొత్త ప్రాజెక్టు సికిందర్ మూవీలో రష్మికను కథానాయికగా సెలక్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ సినిమా కోసం రష్మిక ఏకంగా రూ.13 కోట్లు పారితోషికం తీసుకుంటుందని సమాచారం. యానిమల్ సినిమాకు మాత్రం రూ.4 కోట్లు వసూలు చేసిందట.
సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ నయనతార. ఒక్కో సినిమాకు రూ. 5 నుంచి రూ. 10 కోట్లు పారితోషికం తీసుకుంటుందట.
కానీ ఇప్పుడు నయనతార కంటే ఎక్కువ రష్మిక రెమ్యునరేషన్ తీసుకుంటుందని టాక్ వినిపిస్తుంది. ఈ చిత్రానికి ఎఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఇవే కాకుండా ఇటు తెలుగులోనూ రష్మికకు మరిన్ని ఆఫర్స్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక పుష్ప 2 రిలీజ్ తర్వాత రష్మిక క్రేజ్ మరింత మారడం ఖాయం.
ఇక్కడ క్లిక్ చేయండి.