19 August 2024

రూ.150 కోట్ల ఆఫర్ రిజెక్ట్ చేసిన రష్మిక మందన్నా.. కారణం ఇదే.. 

Rajitha Chanti

Pic credit - Instagram

సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది. తెలుగు, హిందీలో సినిమాలు చేస్తుంది. 

పుష్ప సినిమాతో ఈ బ్యూటీ క్రేజ్ మారిపోయింది. దీంతో అటు హిందీ, ఇటు తమిళంతోపాటు తెలుగులోనూ వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి.

ప్రస్తుతం తెలుగులో అల్లు అర్జున్ సరసన పుష్ప 2 చిత్రంలో నటిస్తుంది. డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న సినిమా షూటింగ్ జరుగుతుంది.

అలాగే లేడీ ఓరియెంటెడ్ మూవీస్ రెయిన్ బో, గర్ల్ ఫ్రెండ్ చిత్రాల్లో నటిస్తుంది. ఇవే కాకుండా యానిమల్ 2 చిత్రంలోనూ నటించనుంది. 

ఇదిలా ఉంటే.. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం నేషనల్ క్రష్ రష్మిక మందన్నా రూ.150 కోట్ల బడ్జెట్ ఆఫర్ రిజెక్ట్ చేసిందని టాక్.

అదే తంగళాన్. కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటించిన ఈ సినిమా ఆగస్ట్ 15న విడుదలై సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది.

ఈ సినిమాలో ఆర్తి పాత్రలో హీరోయిన్ మాళవిక మోహనన్ నటించింది. ఇందులో  నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటనతో అదరగొట్టింది

అయితే ఈ పాత్ర కోసం ముందుగా రష్మికను అనుకున్నారట డైరెక్టర్. కానీ డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఆఫర్ రిజెక్ట్ చేసిందట ఈ  బ్యూటీ.