03 February 2024

అది కరెక్ట్ కాదు.. ‘పుష్ప2’ ఫొటో లీక్‌పై రష్మిక అసహనం.. 

TV9 Telugu

Pic credit - Instagram

ఇటీవలే యానిమల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుంది నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. ఈ సినిమాతో అటు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా ఫుల్ క్రేజ్ సొంతం చేసుకుంది. 

దీంతో అటు హిందీలో ఈ బ్యూటీకి మరిన్ని అవకాశాలు క్యూ కట్టాయి. ఇటు తెలుగులోనూ బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరిస్తుంది రష్మిక. అందులో పుష్ప 2 సినిమా కూడా ఒకటి. 

డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రష్మిక శ్రీవల్లి పాత్రలో కనిపించనుంది. 

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే పుష్ప 2 నుంచి అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. తాజాగా రష్మిక ఫోటో నెట్టింట్ లీక్ అయ్యింది. 

తాజాగా పుష్ప 2 నుంచి తన ఫోటో లీక్ కావడంపై అసహనం వ్యక్తం చేసింది రష్మిక. షూటింగ్ సెట్ నుంచి ఇలా నటీనటుల ఫోటోస్ లీక్ చేయడం ఏమాత్రం అమోదయోగ్యంకాదు. 

ఈ సినిమా కోసం ఎంతో మంది ఉత్సాహంగా వెయిట్ చేస్తున్నారు. అలా అని లీకైన ఫోటోలను షేర్ చేయకూడదు. ఫోటోస్ ఇలా లీక్ చేస్తే విడుదలయ్యాక చూసే ఆసక్తి అసలు ఉండదు. 

సరైన సమయంలో ఈ సినిమా ముందుకు వస్తుంది. థియేటర్లో వందశాతం వినోదాన్ని పంచడం కోసం టీమ్ అంతా ఎంతో శ్రమిస్తుంది. దయచేసి ప్రైవసీకి భంగం కలిగించొద్దు అని తెలిపింది. 

పుష్ప 2 పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. గతంలో విడుదలైన పుష్ప సినిమా క్లైమాక్స్ లో రష్మిక, అల్లు అర్జున్ కు మ్యారేజ్ అవుతుంది. ఇందులో సరికొత్తగా కనిపించనుంది.