28 October 2025

తల్లిని అయ్యాక పరిస్థితి ఎలా ఉంటుందో.. వర్కింగ్ అవర్స్ పై రష్మిక..

Rajitha Chanti

Pic credit - Instagram

గత కొంతకాలంగా ఇండస్ట్రీలో సినీనటీనటుల పని గంటలపై చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా హీరోయిన్ రష్మిక సైతం ఈ విషయంపై స్పందించారు.

నిర్ధిష్ట పనివేళలు ఉండాలని తాను కోరుకుంటున్నానని అన్నారు. ది గర్ల్ ఫ్రెండ్ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో రష్మిక ఆసక్తికర కామెంట్స్ చేసింది.

నటీనటులకే కాదు దర్శకుల నుంచి లైట్ మ్యాన్ వరకు అందరికీ నిర్ధిష్ట పనివేళలు ఉంటే బాగుంటుంది. దీంతో కుటుంబంతో గడిపే సమయం దొరుకుందని అన్నారు.

రష్మిక మాట్లాడుతూ నేను ఫ్యామిలీపై దృష్టి పెట్టాలనుకుంటున్నాను. భవిష్యత్తు గురించే ఆలోచిస్తుంటాను. తల్లిని అయ్యాక పరిస్థితి ఎలా ఉంటుందో ఊహిస్తుంటాను.

అని అన్నారు. ఇప్పుడు రష్మిక చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇటీవల పనిగంటల విషయంలోనే దీపిక రెండు ప్రాజెక్ట్స్ నుంచి తప్పుకుంది.

పని గంటలపై ఫిల్మ్ వర్గాల్లో పెద్ద చర్చే నడుస్తుంది. ఇటీవల కాలంలో ఈ విషయంపై సినీప్రముఖులు, దర్శక నిర్మాతలు సైతం వర్కింగ్ అవర్స్ పై స్పందించారు.

ప్రస్తుతం ఇండస్ట్రీలో రష్మిక మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. బ్యాక్ టూ బ్యాక్ హిట్స్.. చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. ఇప్పుడు ది గర్ల్ ఫ్రెండ్ తో రాబోతుంది.

ఈ సినిమా నవంబర్ 7న అడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా ది గర్ల్ ఫ్రెండ్ సినిమా ప్రమోషన్లలో పాల్గొంటుంది ఈ ముద్దుగుమ్మ.