బంగారు కిరీటం సమర్పించిన రష్మిక!

TV9 Telugu

21 March 2024

యాగంటి క్షేత్రంలోని గుహలో కొలువైన వేంకటేశ్వరస్వామికి బంగారు కిరీటాన్ని సమర్పించారు నేషనల్‌ క్రష్‌ రష్మిక.

టాలీవుడ్ శ్రీవల్లి కిరీటాన్ని స్వామి వారికి సమర్పిస్తున్నారని తెలిసి యంగంటి క్షేత్రం మొత్తం సందడిగా మారింది.

రష్మిక మందాన్నని చూడడానికి వచ్చిన చుట్టుపక్కల ఊళ్లల్లోని జనాలతో ఏపీలో యాగంటి క్షేత్రం కిక్కిరిసిపోయింది.

ఈ క్షేత్రంతో శ్రీవల్లికి ఉన్న లింకేంటి అని అంటారా? చాలానే ఉందని చెబుతున్నారు పుష్ప దర్శకుడు సుకుమార్‌.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా ఆయన డైరక్ట్ చేస్తున్న సినిమా యాక్షన్ చిత్రం పుష్ప2 ది రూల్‌.

ఈ సినిమాలోని కీలక సన్నివేశం కోసమే శ్రీవల్లితో కిరీటాన్ని భగవంతుడికి సమర్పింపజేశారు డైరక్టర్‌ సుకుమార్.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ యాగంటి క్షేత్రంలో జరుగుతోంది. ఇటీవల వైజాగ్‌ పరిసరాల్లోనూ కీలక సన్నివేశాలను తెరకెక్కించారు.

రష్మిక మందన్నను చూడటానికి చుట్టూ పల్లెల్లోని జనం గుమిగూడటంతో యాగంటి క్షేత్రంలో కళగా మారింది వాతావరణం.