30 September 2025

తగ్గేదేలే..  రష్మిక ఆస్తులు ఎన్ని కోట్లు ఉన్నాయంటే..

Rajitha Chanti

Pic credit - Instagram

బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటూ ఫుల్ జోష్ మీదున్న హీరోయిన్ రష్మిక మందన్నా. ఇప్పుడు చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతుంది.

 ప్రస్తుతం భారతీయ సినిమా పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఆమె ఒకరు. ఇటీవలే ఆమె నటిస్తోన్న థామా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. 

1996 లో జన్మించిన రష్మిక.. కిరిక్ పార్టీ సినిమాతో తన నటనా రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత ఛలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ బ్యూటీ. 

తెలుగు, తమిళంలో వరుసగా హిట్స్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు తెలుగుతోపాటు హిందీలో చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. 

నివేదికల ప్రకారం రష్మిక ఆస్తులు రూ.50 కోట్లకు పైగానే ఉంటాయట. అలాగే నెలకు రూ.60 లక్షలకు పైగా.. సంవత్సరానికి 8 కోట్లు సంపాదిస్తుందని టాక్. 

భారతీయ సినిమా ప్రపంచంలో అత్యధిక పారితోషికం తీసుకునే టాప్ 10 నటీమణులలో రష్మిక ఒకరు. ఒక్కో చిత్రానికి దాదాపు  రూ. 5 నుండి 10 కోట్లు తీసుకుంటుంది.

ముంబైలో ఆమెకు మంచి విలాసవంతమైన ప్లాట్ ఉందట. అలాగే ఆమె ఎక్కువగా రియల్ ఎస్టేట్, పలు వ్యాపార సంస్థలలో పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. 

రష్మిక వద్ద రేంజ్ రోవర్ స్పోర్ట్,  ఆడి క్యూ3, మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్, టయోటా ఇన్నోవా, హ్యుందాయ్ క్రెటా వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. నెట్టింట చాలా యాక్టివ్.