06 January 2024
రష్మిక సంపాదన మొత్తం పెట్టుబడులకే ఖర్చు చేస్తోందా ?..
TV9 Telugu
Pic credit - Instagram
ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‍గా చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది రష్మిక మందన్నా. ఇటీవలే యానిమల్ మూవీతో హిట్ కొట్టింది.
యానిమల్ హిట్‌తో ఇప్పుడు ఒక్కో సినిమాకు దాదాపు రూ. 6 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుంది. అటు బిజినెస్ రంగంలోనూ రాణిస్తోందట.
అయితే ఇప్పుడు వినిపిస్తున్న సమాచారం ప్రకారం తన సంపాదనలో అధిక శాతం రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్లకే ప్రాధాన్యత ఇస్తుందని తెలుస్తోంది.
సినిమాలతోపాటు బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల ద్వారా పెద్ద మొత్తంలోనే సంపాదిస్తుంది రష్మిక. అలాగే ఇటు వ్యాపారాల్లోనూ ఎక్కువగా సంపాదిస్తుంది.
ఇటీవలే బెంగుళూరులో ఓ బంగ్లాను కొనుగోలు చేసిందట రష్మిక.. ఆ ఇంటి విలువ దాదాపు రూ. 10 కోట్లు ఉంటుందని నెట్టింట టాక్ వినిపిస్తుంది.
ముంబయిలో ఓ విలాసవంతమైన అపార్ట్మెంట్ కొనుగోలు చేసిందని అంటున్నారు. గోవా, కూర్గ్, హైదరాబాద్ ప్రాంతాల్లో అపార్ట్మెంట్స్ కొనేసిందట.
వ్యాపారం నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి రావడంతో రష్మిక మందన్న పెట్టుబడుల విషయంలో చాలా తెలివిగా నిర్ణయాలు తీసుకుంటుందని టాక్.
ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన పుష్ప 2 చిత్రంలో నటిస్తుంది. అలాగే ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలో కనిపించనుంది. ఇవే కాకుండా మరిన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయట.
ఇక్కడ క్లిక్ చేయండి.