ఇప్పుడు వారందరూ నన్ను తిట్టుకుంటున్నారు: రష్మిక

31 October 2024

Basha Shek

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్, శాండిల్‌ వుడ్‌.. ఇలా అన్ని భాషల్లోనూ స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతోంది రష్మిక మందన్నా.

ముఖ్యంగా అల్లు అర్జున్ తో కలిసి నటించిన పుష్ఫ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ కు మారిపోయింది రష్మిక మందన్నా.

ఇక రణ్ బీర్ కపూర్ తో కలిసి రష్మిక నటించిన యానిమల్ సినిమా ఏకంగా రూ. 900 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

ప్రస్తుతం ఈ క్రేజీ హీరోయిన్ చేతిలో పుష్ప 2, కుబేర, సికిందర్ (హిందీ) వంటి క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి.

వీటి సంగతి పక్కన పెడితే మరోవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాల్లోనూ నటిస్తూ బిజీ బిజీగా ఉంటోందీ అందాల తార.

ప్రస్తుతం హిందీ తదితర ఇతర భాషలపై దృష్టి పెట్టడం వల్ల తెలుగులో ఎక్కువ చిత్రాలు చేయలేకపోతున్నానంది రష్మిక.

అందువల్ల తెలుగు సినీ ప్రేక్షకులు సామాజిక మాధ్యమాల్లో ఈ విషయమై తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారందీ ముద్దుగుమ్మ

కొందరైతే తనను తిట్టుకుంటున్నారని సరదాగా చెప్పుకొచ్చింది రష్మిక. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.