09 February 2024
ఆ సినిమాలో నటించడం ఇష్టం లేదు.. అతని కోసమే ఒప్పుకున్నా: రష్మిక
TV9 Telugu
ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్.. ఇలా అన్ని సినిమా ఇండస్ట్రీలను ఒక ఊపు ఊపేస్తోంది కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా.
ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ హిట్లతో దూసుకుపోతోన్న రష్మిక మందన్నా చేతిలో పలు పాన్ ఇండియా ప్రాజెక్టులున్నాయి.
అయితే ఎన్నో సినిమాల్లో నటించిన రష్మికకు ఓ మూవీలో చేయడం అసలు ఇష్టం లేకపోయినా నటించిందట.
ఇంతకీ రష్మికకు అసలు నచ్చని ఆ సినిమా ఏంటో తెలుసా? శర్వానంద్ హీరోగా నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు
ఈ సినిమా కథ నచ్చకపోయినా కేవలం హీరో శర్వానంద్, డైరెక్టర్ కోసమే అంగీకరించానని ఇటీవల ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది రష్మిక.
రష్మిక చెప్పినట్లే ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలో శర్వా, రష్మికల జోడీకి మంచి మార్కులు పడ్డాయి. అయితే కథ కుదరలేదు.
భారీ అంచనాలు, క్యాస్టింగ్ తో థియేటర్లలో రిలీజైన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
ఇక రష్మిక చేతిలో ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప2తో పాటు ఒక లేడీ ఓరియంటెడ్ మూవీ ఉంది. కొన్ని తమిళ సినిమాలు కూడా ఉన్నాయి.
ఇక్కడ క్లిక్ చేయండి..