ఆ స్టార్ హీరో తో జతకట్టనున్న రష్మిక.. లక్కీ ఛాన్స్ కొట్టేసిందిగా 

Phani.ch

28 May 2024

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అటు దేవర.. ఇటు వార్ 2 చిత్రీకరణలలో పాల్గొంటూ క్షణం తీరికలేకుండా గడిపేస్తున్నారు.

ఈ రెండు చిత్రాలపై భారీ అంచనాలు ఉన్నాయి. కొన్ని రోజులుగా వార్ 2 షూటింగ్ కోసం ముంబైలోనే ఉంటున్న తారక్ ఇటీవలే హైదరాబాద్ చేరుకున్నారు.

త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ రానున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో తాజాగా తారక్ నెక్ట్స్ సినిమా గురించి మరో క్రేజీ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తుంది.

అదేంటంటే.. దేవర, వార్ 2 చిత్రాల అనంతరం ప్రశాంత్నీ నీల్, తారక్ కాంబోలో రాబోయే ప్రాజెక్ట్ స్టార్ట్ చేయనున్నట్లు టాక్.

ఇటీవల ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్ ఈ ఏడాదిలోనే స్టార్ట్ కాబోతున్నందని మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

వీరిద్దరి కాంబోలో రాబోయే సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారట. ఇక ఈ సినిమా కోసం నేషనల్ క్రష్ రష్మిక మందన్నాను ఎంపిక చేయాలని భావిస్తున్నాడట.

ఇందులో హీరోయిన్ పాత్రకు ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుందని.. అందుకే రష్మికను హీరోయిన్ గా సెలక్ట్ చేయాలనుకుంటున్నారట.