04 April 2024

రష్మికలో ఈ ట్యాలెంట్ కూడా ఉందా? ఏకంగా..

Rajitha Chanti

అల్లు అర్జున్ తో కలిసి నటించిన పుష్ప సినిమా రష్మిక మందన్నా క్రేజ్ ను అమాంతం పెంచేసింది. పాన్ ఇండియా లెవెల్ లో ఆమెకు గుర్తింపు తీసుకొచ్చింది.

ఆ తర్వాత బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణ్ బీర్ కపూర్ తో కలసి ఆమె నటించిన యానిమల్ సినిమా కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

ప్రస్తుతం దక్షిణాది సినిమాలతో పాటు  బాలీవుడ్  సినిమాల్లో నూ నటిస్తూ బిజిబిజీగా గడుపుతోంది రష్మిక మందన్నా

అంతేకాదు ఇప్పటివరకు హీరోయిన్ గా  గ్లామరస్ పాత్రలనే ఎక్కువగా పోషించిన రష్మిక మందన్నా ఇప్పుడు లేడీ ఓరియంటెడ్ మూవీస్ లోనూ నటిస్తోంది.

రష్మిక మందన్నా నటిస్తోన్న గర్ల్ ఫ్రెండ్ సినిమా ఈ కోవకు చెందినదే. ఇదివరకే రిలీజైన ఈ మూవీ గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని పెంచేసింది.

రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తోన్న గర్ల్ ఫ్రెండ్  సినిమా టీజర్ కోసం ఏకంగా ఐదు భాషల్లో డబ్బింగ్ చెప్పిందట రష్మిక మందన్నా.

తెలుగు తో పాటు తమిళ్, మలయాళం, కన్నడ హిందీ భాషల్లో డబ్బింగ్‌ చెప్పింది రష్మిక. ఆమె మలయాళం మాట్లాడటం ఇదే  మొదటిసారి.

మొత్తానికి నటనతో పాటు ఐదు భాషల్లోనూ రష్మిక డబ్బింగ్‌ చెప్పిన విధానం అద్భుతం అని కొనియాడుతున్నారు ఆమె అభిమానులు.