05 November 2025
మగాళ్లకి కూడా పీరియడ్స్ వస్తే మా బాధ అప్పుడు తెలిసేది.. రష్మిక
Rajitha Chanti
Pic credit - Instagram
ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రష్మిక మందన్న. ఇటీవలే థామా సినిమాతో హిట్ అందుకున్న ఈ బ్యూటీ ది గర్ల్ ఫ్రెండ్ సినిమాతో రానుంది.
ఈ సినిమా నవంబర్ 7వ విడుదలకానుంది. కొన్ని రోజులుగా ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొంటుంది రష్మిక. తాజాగా ఆమె చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి.
తాజాగా జగపతిబాబు హోస్ట్ చేస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా’ టాక్ షోలో పాల్గొంది. తన చిన్ననాటి రోజులను, జ్ఞాపకాలను గుర్తుచేసుకుంది.
ఈషోలో ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పింది. ముఖ్యంగా ఆమె ఒక ప్రశ్నకు ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
మగాళ్లకు పీరియడ్స్ వస్తే బాగుండని అనిపించింది. ఆ నొప్పి, అసౌకర్యం, మూడ్ స్వింగ్స్ అన్నీ అనుభవిస్తేనే మహిళల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకుంటారు.
రష్మిక ఇచ్చిన సమాధానంతో అక్కడున్న అడియన్స్ చప్పట్లు కొట్టాడు. జగపతిబాబు సైతం రష్మిక మాటలకు అభినందనలు తెలిపారు.
ఇంటెన్స్ లవ్ స్టోరీగా వస్తున్న ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలో కన్నడ హీరో దీక్షిత్ శెట్టి హీరోగా నటిస్తుండగా.. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు.
ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 7న రిలీజ్ కానుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్