రష్మిక ఖాతాలో రికార్డులెన్నో.. నేషనల్ క్రష్ గురించి తెలుసా ?..
Rajitha Chanti
Pic credit - Instagram
ఏప్రిల్ 5న రష్మిక మందన్నా పుట్టినరోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి ఈ బ్యూటీకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
కిరిక్ పార్ట్ సినిమాతో కన్నడ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఛలో మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది.
పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్రలో.. ఇటీవల విడుదలైన యానిమల్ మూవీలో గీతాంజలి పాత్రలో తనదైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుని తానేంటో నిరూపించుకుంది.
ఇటీవల టోక్యోలో జరిగిన క్రంచీ రోల్ అనిమే అవార్డులకు హజరైంది ఈ ముద్దుగుమ్మ. భారత్ నుంచి ఈ వేడుకకు హాజరైన తొలి సెలబ్రెటీ రష్మికనే కావడం విశేషం.
అలాగే జపాన్‌కు చెందిన ఒనిట్సుకా టైగర్ ఫ్యాషన్ సంస్థకు బ్రాండ్ అడ్వకేట్‌గా వ్యవహరిస్తోంది. ఆ సంస్థకు అడ్వకేట్‌గా నియమితులైన ఫస్ట్ ఇండియన్ రష్మికనే.
ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకటించిన ‘ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30’ జాబితాలోనూ రష్మిక స్థానం సంపాదించుకుంది. ఇందులో అగ్రస్థానంలో నిలిచింది రష్మిక మందన్నా.
అలాగే నెదర్లాండ్స్‌కు చెందిన సెప్టిమిస్ అవార్డ్స్ నామినేషన్స్‌లో నిలిచింది రష్మిక. ఇందులో బెస్ట్ ఏషియన్ యాక్ట్రెస్ నామినేషన్స్‌లో ఇండియా నుంచి రష్మిక నిలిచింది.
అలాగే ఇన్ స్టాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ హీరోయిన్లలో రష్మిక ఒకరు. ఆమెకు ప్రస్తుతం 43 మిలియన్స్ మంది ఫాలోవర్స్ ఉన్న తొలి హీరోయిన్ రష్మిక కావడం విశేషం.