15 July 2024
సింపుల్‌గా కనిపిస్తున్న రష్మిక చీర చాలా కాస్ట్లీ.. ఎన్ని లక్షలంటే..
Rajitha Chanti
Pic credit - Instagram
పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్గా ఫాలోయింగ్ సొంతం చేసుకుంది హీరోయిన్ రష్మిక మందన్నా. ఆ తర్వాత హిందీలో వరుస సినిమాలు చేసింది.
ప్రస్తుతం పుష్ప 2 చిత్రీకరణలో బిజీగా ఉన్న రష్మిక... శుక్రవారం నుంచి ఆదివారం వరకు జరిగిన అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లిలో సందడి చేసింది.
జూలై 12న జరిగిన అనంత్ అంబానీ, రాధిక పెళ్లి వేడుకలో పాల్గొన్న రష్మిక.. ఆ తర్వాతి రోజు జరిగిన శుభ్ ఆశీర్వాద్ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది.
శుభ్ అశీర్వాద్ వేడుకలో రష్మిక రాయల్ బ్లూ చీరలో మరింత అందంగా కనిపించింది. సహజమైన రూపంలో సింపుల్ మేకప్‌తో మంత్రముగ్దులను చేసింది.
ఈ వేడుకలలో రష్మిక ధరించిన నేవీ బ్లూ కలర్ చీర సింపుల్‌గా కనిపిస్తున్నప్పటికీ.. ఈ చీర మాత్రం చాలా కాస్ట్లీ అని తెలిసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్.
లేటేస్ట్ సమాచారం ప్రకారం రష్మిక ధరించిన చీర విలువ ఏకంగా రూ.1.28 లక్షలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రష్మిక ఫోటోస్ వైరలవుతున్నాయి.
ఈ విలువైన చీరలో సింపుల్‌గా కనిపించిన రష్మిక.. నీలమణి, వజ్రాలతో అలంకరించిన అందమైన హారాన్ని ధరించి ఆమె రూపాన్ని పూర్తి చేసింది.
ఇక రష్మిక లేటేస్ట్ లుక్ చూసి మంత్రముగ్దులవుతున్నారు నెటిజన్స్. ప్రస్తుతం తెలుగు, హిందీ, తమిళంలో వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది రష్మిక.
ఇక్కడ క్లిక్ చేయండి.