తొలిసారి రష్మిక డబ్బింగ్‌.. ఆయన కాల్షీట్‌ కుదర్లేదు.. 

TV9 Telugu

03 April 2024

తొలిసారి మలయాళంలో తన సొంత వాయిస్ తో డబ్బింగ్‌ చెప్పారు టాలీవుడ్ హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక మందన్న.

ప్రస్తుతం ఈ వయ్యారి భామ ప్రధాన పాత్రలో నటిస్తున్న టాలీవుడ్ రొమాంటిక్ డ్రామా సినిమా ది గర్ల్ ఫ్రెండ్‌.

ఈ సినిమా టీజర్‌ని నటి రష్మిక మందన్న పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్‌ 5న విడుదల చేయనున్నారు మూవీ మేకర్స్.

ఈ సినిమా కోసమే తొలిసారి మలయాళంలో మాట్లాడారు నేషనల్‌ క్రష్‌. రష్మిక డెడికేషన్‌ సూపర్‌ అంటూ ప్రశంసిస్తున్నారు నెటిజన్లు.

హీరోయిన్స్ తమన్నా భాటియా, రాశీఖన్నా కీలక పాత్రల్లో నటించిన కోలీవుడ్ హార్రర్ కామెడీ సినిమా అరణ్మణై4.

ఈ కామెడీ హారర్ చిత్రంలో కోలీవుడ్ స్టార్ నటుడు మక్కల్ సెల్వన్ విజయ్‌ సేతుపతి ఓ పాత్రలో నటించాల్సింది.

కానీ, ఆయనకు కాల్షీట్‌ కుదరకపోవడంతో చేయలేదు. ఈ విషయాన్ని ట్రైలర్‌ విడుదల సందర్భంగా ప్రకటించారు డైరక్టర్‌ సుందర్‌.సి.

విజయ్‌ సేతుపతికి కుదరకపోవడంతో ఆయన చెయ్యాల్సిన పాత్రలో తానే నటించినట్టు చెప్పారు ఈ చిత్ర దర్శకుడు సుందర్‌.సి.