TV9 Telugu
కల నెరవేరింది: రష్మిక.. డిప్రెషన్‌కి గురైన ఇలియానా..
05 March 2024
జపాన్‌కి వెళ్లాలనే తన చిన్నప్పటి కల నెరవేరిందని చెపింది నేషనల్ క్రష్, స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న.
అక్కడి ప్రజల అభిమానం, పరిసరాల శుభ్రత చూసిన తర్వాత ప్రతి ఏటా వెళ్లాలని అనుకుంటున్నట్టు తెలిపింది ఈ బ్యూటీ.
క్రంచీ రోల్ అనిమే అవార్డుల వేడుకలో పాల్గొన్నారు రష్మిక మందన్న. ఆ ఈవెంట్‌లో పాల్గొనడం తన అదృష్టమని చెప్పింది.
ఆమె నటిస్తున్న పుష్ప2 ఆగస్టు 15న విడుదల కానుంది. దీంతో పాటు ది గర్ల్ ఫ్రెండ్ మూవీలో నటిస్తుంది రష్మిక.
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దాదాపు అందరు బడా హీరోల సరసన నటించి ఆకట్టుకుంది జీరో సైజు బ్యూటీ ఇలియానా.
తర్వాత కొన్ని కారణాల వల్ల సినిమాలకు దూరమయ్యింది. తాజాగా డెలివరీ తర్వాత డిప్రెషన్‌కి గురయినట్టు చెప్పింది నటి ఇలియానా.
ప్రస్తుతం దాని నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తున్నట్టు తెలిపింది. డెలివరీ తర్వాత నిద్రలేమి సమస్య తనను వేధిస్తోందని చెప్పింది.
దాన్నుంచి బయటపడటానికి వర్కవుట్లు చేస్తున్నట్టు తెలిపింది. కొన్ని సార్లు వర్కవుట్లకు కూడా సమయం ఉండటం లేదని చెప్పింది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి