నేషనల్ క్రష్ న్యూ లుక్స్.. అశోక్ గల్లా ఫస్ట్ లుక్.. 

TV9 Telugu

06 April 2024

ఏప్రిల్ 5న నేషనల్ క్రష్ రష్మిక మందన్న పుట్టిన రోజు సందర్భంగా ఆమె నటిస్తున్న సినిమాల లుక్స్ విడుదలయ్యాయి.

అల్లు అర్జున్ సరసన నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం పుష్ప 2 ది రూల్ నుంచి శ్రీవల్లి లుక్ విడుదల చేసారు మేకర్స్.

మరోవైపు ది గర్ల్ ఫ్రెండ్, రెయిన్ బో సినిమాల నుంచి కూడా ఆమె ఫోటోలను విడుదల చేసారు ఆ చిత్రాల మూవీ మేకర్స్.

ఇటీవల యాక్షన్ డ్రామా యానిమల్ చిత్రంతో  బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ అందుకుంది. దీంతో అక్కడ కూడా ఆఫర్లు వస్తున్నాయి.

సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి వచ్చిన మరో వారసుడు అశోక్ గల్లా. స్టార్ హీరో మహేష్ బాబుకి మేనల్లుడు.

ఇప్పటికే ఈయన ప్రధాన పాత్రలో తెరకెక్కిన హీరో సినిమాతో సినీ అరంగేట్రం చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

ఈయన హీరోగా సితార ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మిస్తున్న సినిమా కాన్సెప్ట్ పోస్టర్‌ను మహేష్ బాబు తన ట్విట్టర్‌లో విడుదల చేసారు.

తాజాగా అశోక్ గల్లా పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఆయన ఫస్ట్ లుక్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు.