22 September 2023

బాలీవుడ్ మాయలో టాలీవుడ్ కాదంది.. రష్మిక ఆశలన్నీ ఆ సినిమాపైనే.. 

Pic credit - Instagram

సౌత్ ఇండస్ట్రీలో అత్యథిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్లలో రష్మిక ఒకరు. ఇప్పుడు ఈ బ్యూటీ చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. 

అటు తెలుగులోనే కాకుండా.. తమిళంలోనూ సత్తా చాటింది ఈ బ్యూటీ. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ ఫుల్ ఫాంలో ఉంది.

అయితే పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మకు హిందీలో అవకాశాలు క్యూ కట్టాయి. 

దీంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో వచ్చిన ప్రతి అవకాశానికి ఈ బ్యూటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇప్పటికే గుడ్ బై, మిషన్ మజ్ను చిత్రాల్లో అలరించింది. 

ఈ రెండు సినిమాలు అంతగా హిట్ కాలేదు. దీంతో ఇప్పుడు ఈ బ్యూటీ ఆశలన్నీ యానిమల్ సినిమాపైనే ఉన్నాయి. ఇందులో రణబీర్ హీరో. 

 అయితే బాలీవుడ్ అవకాశాలు క్యూకట్టడంతో తెలుగు సినిమాలను వదులుకుంది రష్మిక. దీంతో ఇప్పుడు ఈ బ్యూటీ చేతిలో పుష్ప మాత్రమే ఉంది. 

అటు హిందీలోనూ సరైన హిట్ రాకపోవడంతో ఇప్పుడు మళ్లీ టాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది రష్మిక. ఇప్పుడు రవితేజ సినిమాలో ఛాన్స్ అందుకుంది. 

గోపిచంద్ మలినేని, రవితేజ కాంబోలో రాబోతున్న ప్రాజెక్టులో ఫిమేల్ లీడ్ పాత్ర కోసం రష్మికను సెలక్ట్ చేసినట్లుగా తెలుస్తోంది.