అందమే తన కోసం పుట్టిందేమో అనేలా కనిపిస్తున్న రష్మీ..

TV9 Telugu

10 January 2024

27 ఏప్రిల్ 1978న ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో ఓ బ్రాహ్మణ కుటుంబంలో జన్మిచింది అందాల తార రష్మీ గౌతమ్.

విశాఖపట్నంలోని మధురవాడలో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో తన పాఠశాల విద్యను పూర్తి చేసింది ఈ వయ్యారి భామ.

డెస్టినీ సిటీగా పేరు పొందిన విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పట్టా పొందింది ఈ ముద్దుగుమ్మ.

2002లో ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన హోలీ చిత్రంలో సునీల్ గర్ల్ ఫ్రెండ్ పాత్రతో తన సినిమా కెరీర్ మొదలుపెట్టింది.

తర్వాత తెలుగులో కొన్ని చిత్రల్లో చిన్ని, చిన్న పాత్రల్లో నటిస్తూ కెరీర్ ను కొనసాగించింది ఈ అందాల తార.

2007లో యువ అనే ఓ టెలివిజన్ షోతో బుల్లితెరపై అడుగుపెట్టింది ఈ వయ్యారి. ఇలా 2013లో జబర్దస్త్ యాంకర్ గ ఎంపికైంది.

2014లో ఎక్స్ ట్రా జబర్దస్త్ యాంకర్ గా సెలెక్ట్ అయింది. అప్పటినుండి ఇప్పటివరకు బ్రేక్ యాంకర్ గా కొనసాగుతుంది.

ప్రస్తుతం ఎక్స్ ట్రా జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీకి యాంకర్ గా వ్యహరిస్తుంది ఈ వయ్యారి భామ.