ఆ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించాలి.. రష్మి..

ప్రస్తుతం డిజిటల్ ప్రపంచంలో జీవనం కష్టతరంగా మారిందని యాంకర్‌ రష్మి తెలిపింది.

టెక్నాలజీని ఉపయోగించి వికృత చేష్టలకు పాల్పడేవారిపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఫ్యాన్స్ ను కోరింది ఆమె.

‘‘ప్రస్తుతం ఉన్న డిజిటల్‌ యుగంలో సురక్షితంగా జీవించడం క్లిష్టంగా మారింది.

AI టెక్నాలజీ వాడి న్యూడ్‌ ఫొటోలు క్రియేట్‌ చేసేవారికి చిక్కకుండా అమ్మాయిలందరు జాగ్రత్తగా ఉండాలి.

దీనికి బదులు వీటిపై అవగాహన కల్పించడం ఎంతో అవసరం. కనిపించేదంతా నిజం కాదని ప్రజలకు తెలిసేలా చేద్దాం.

కేవలం సరదా కోసం అసభ్యకరమైన వీడియోలు సర్క్యూలేట్‌ చేయొద్దని చెబుదాం’’ అని పేర్కుందామె.

ఓ నెటిజన్‌ షేర్‌ చేసిన పోస్ట్‌ను తన ఇన్‌స్టాలో షేర్‌ చేస్తూ.. ‘‘ఈ పోస్ట్‌ను చూస్తున్న అమ్మాయిలందరూ వెంటనే సోషల్‌మీడియా ఖాతాను ప్రైవేట్‌ చేసుకోండి.

అలాగే డీపీలో ఒకవేళ మీ ఫొటో ఉంటే తీసేయండి. మీ ఫొటోలను ఏ ఒక్కరితోనూ పంచుకోవద్దు.

ఎందుకంటే, ఏఐ టెక్నాలజీని ఉపయోగించి కొంతమంది దుర్మార్గులు అసభ్యకరమైన ఫొటోల్ని క్రియేట్‌ చేస్తున్నారు.

దయచేసి ఆన్‌లైన్‌లో జాగ్రత్తగా ఉండండి’’ అంటూ నెటిజన్‌ పెట్టిన సందేశాన్ని అభిమానులతో షేర్ చేసుకుంటూ హెచ్చరించింది ఆమె.