అందం ఈ బ్యూటీ చెంతకు చేరి.. తనలో ఐక్యమైందేమో..

TV9 Telugu

28 March 2024

27 ఏప్రిల్ 1982న ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖపట్నంలో ఓ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది వయ్యారి భామ రష్మీ గౌతమ్.

ఈ వయ్యారి తల్లి ఆంధ్ర పొరుగు రాష్ట్రం ఒడిస్సాకి చెందినవారు. ఈమె తండ్రి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు.

2002లో ఉదయ్ కిరణ్ హోలీ చిత్రంలో కమెడియన్ సునీల్ గర్ల్ ఫ్రెండ్ సాలుగా తొలిసారి సిల్వర్ స్క్రీన్ పై కనిపించింది.

2007లో యువ అనే ఓ తెలుగు టెలివిజన్ షోతో బుల్లితెరపై అడుగుపెట్టింది. తర్వాత కొన్ని టీవీ షోలు చేసింది ఈ బ్యూటీ.

2013లో అనసూయ రీప్లేస్ లో కొన్ని రోజులు ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ షోకి యాంకర్ గా చేసింది ఈ వయ్యారి.

2014లో జబర్దస్త్ షోకి ఎక్సటెన్షన్ గా వచ్చిన ఎక్స్ట్రా జబర్దస్త్ కి యాంకర్ అయింది. ఈ షోతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇందులో యాంకర్ గా చేస్తూనే సిద్దు జొన్నలగడ్డకి జోడిగా గుంటూరు టాకీస్ అనే చిత్రంలో కథానాయకిగా నటించింది.

2022 బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమాలో హీరో నందుకి జోడిగా నటించింది. ప్రస్తుతం జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలకి యాంకర్ గా చేస్తుంది.