21 November 2023

కిల్లింగ్ లుక్స్‌తో కవ్విస్తున్న రష్మి గౌతమ్

రష్మి గౌతమ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ ముద్దుగుమ్మ  ఇండస్ట్రీకి ఎప్పుడో ఎంట్రీ ఇచ్చారు.

తెలుగు తెరకు ఎప్పుడో పరిచయమైనా  ఈటీవీలో వచ్చే జబర్దస్త్ కామెడీషో ద్వారా బాగా పాపులర్ అయ్యారు.

తన యాంకరింగ్ తో, అందాలతో కనివిందు చేస్తూ తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా క్రేజ్ సంపాదించుకుంది ఈ  ముద్దుగుమ్మ.

ప్రస్తుతం ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు యాంకరింగ్‌గా కూడా అదరగొడుతున్నారు రష్మి గౌతమ్.

 ఆ మధ్య రష్మీ హీరోయిన్‌గా నటించిన 'గుంటూరు టాకీస్ కేవలం రష్మీ  అందచందాలతోనే హిట్ అయ్యిందనటంలో అతిశయోక్తి లేదు.

మహిళలపై రేపుల విషయంలో కానీ, మూగ జీవాల సంరక్షణలోగాని ట్వీట్టర్ వేదికగా స్పందిస్తుంటుంది రష్మీ.

ఇక అది అలా ఉంటే రష్మి‌ తాజాగా కొన్ని ఫోటోలను పంచుకున్నారు. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.