రష్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తన అంద చందాలతో తెలుగు టీవీ రంగంలో మంచి పాపులర్ అయ్యారు.
ఈటీవీలో వచ్చే కామెడీ షో జబర్దస్త్‌లో యాంకరింగ్ చేస్తూ.. తెలుగు రాష్ట్రాల్లో ఓ రేంజ్‌లో క్రేజ్ సంపాదించుకున్నారు.
ప్రస్తుతం ఓ వైపు అడపా దడపా సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు యాంకరింగ్‌గా కూడా అదరగొడుతుంది ఈ బుల్లితెర బ్యూటీ.
అది అలా ఉంటే రష్మికి కాస్తా సామాజిక సోయి, సామాజిక స్పృహా ఉన్న సంగతి తెలిసిందే. ఆమెకు మూగ జీవాలంటే ఎంత ప్రేమో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.
ఒక్క మూగ జీవాలపైనే కాదు.. మహిళలపై జరిగే అకృత్యాలపై కూడా రష్మి స్పందిస్తూ ఉంటారు. ఇక తాజాగా ఇలాంటిదే మరో విషయంలో స్పందించడమే కాదు ఓ సోషల్ మీడియా పోస్ట్ చేశారు.
తెలుగు సినీ ప్రియులకు, టీవీని వీక్షించేవారికి రష్మీ అంటే తెలియని వారుండరంటే అతిశయోక్తికాదు. అంత పాపులర్ ఈ భామ.
తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ..అవకాశం ఉన్నప్పుడు అడపా దడపా సినిమాలు చేస్తూ.. తగిన మోతాదుల్లో అందాలను కనువిందు చేస్తూ..తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా క్రేజ్ సంపాదించుకుంది.
ఆ మధ్య రష్మీ హీరోయిన్‌గా నటించిన 'గుంటూరు టాకీస్' కేవలం రష్మీ పేరు తన అందచందాలతోనే హిట్ అయ్యిందని అంటారు.. ఆమె అభిమానులు.