రష్మీ కు 100 ఎకరాల పొలంతో పాటు.. అన్ని కోట్లు సంపాదించిందా !!

Phani CH

29 AUG 2024

రష్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తన అంద చందాలతో తెలుగు టీవీ రంగంలో మంచి పాపులర్ అయ్యారు.

ఈటీవీలో వచ్చే కామెడీ షో జబర్దస్త్‌లో యాంకరింగ్ చేస్తూ.. తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.

తెలుగు సినీ ప్రియులకు, టీవీని వీక్షించేవారికి రష్మీ అంటే తెలియని వారుండరంటే అతిశయోక్తికాదు. అంత పాపులర్ ఈ భామ.

ఒక దశాబ్ద కాలంలో అడపాదడపా సినిమాలు యాంకరింగ్ చేస్తూ బాగా సంపాదించిందట.. ఈమెకు తన సొంత ఊరు ఒరిస్సా రాష్ట్రంలో 100 ఎకరాల భూమి ఉందట

అయితే ఓ చిట్ చాట్ ప్రోగ్రాం లో రష్మీ 100 ఎకరాల పొలం గురించి అడగగా.. నాకు పొలం ఉన్నమాట నిజమే కానీ వంద ఎకరాలు అయితే లేదు అని తెలిపింది.

మీరు ఇలాంటి ప్రచారాలు చేసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాడి చేసేలా చేయవద్దని నవ్వుతు చెప్పింది.

గతంలో ఓ నిర్మాత  రష్మీకి లగ్జరీ విల్లా గిఫ్ట్ గా ఇచ్చాడంటూ గతంలో ప్రచారం జరిగింది. దాని పై స్పందించి తన ఆవేదన వ్యక్తం చేసింది.

నాకు మంచి ఇల్లు, కారు,  బ్యాంకు బ్యాలెన్స్ కూడా ఉంది ఇది అంత నా కష్టార్జితంతో సంపాదించుకున్నాను అని క్లారిటీ ఇచ్చింది.