యాంకర్ రష్మీ సీరియల్స్ కూడా నటించిందని మీకు తెలుసా ??

Phani CH

18 April 2025

Credit: Instagram

రష్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తన అంద చందాలతో తెలుగు టీవీ రంగంలో మంచి పాపులర్ అయ్యారు.

ఈటీవీలో వచ్చే కామెడీ షో జబర్దస్త్‌లో యాంకరింగ్ చేస్తూ.. తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.

తెలుగు సినీ ప్రియులకు, టీవీని వీక్షించేవారికి రష్మీ అంటే తెలియని వారుండరంటే అతిశయోక్తికాదు. అంత పాపులర్ ఈ భామ.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ  ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే యాంకరింగ్‌గా కూడా అదరగొడుతోంది. రష్మికి కాస్తా సామాజిక స్పృహా ఉన్న సంగతి తెలిసిందే. 

ఆమెకు మూగ జీవాలంటే ఎంత ప్రేమో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. మూగ జీవాలనే  కాకుండా మహిళలపై జరిగే అకృత్యాలపై కూడా రష్మి స్పందిస్తూ ఉంటారు. 

ఇదంతా ఓకే గానీ యాంకర్ రష్మీ సీరియల్స్ లో కూడా నటించిందని తెలుసా?? కెరీర్ ఆరంభంలోనే కొన్ని సీరియల్స్ చేసింది రష్మీ

మా టీవీలో యువ అనే సీరియల్‌లో రష్మీ నటించింది. అదే మా టీవీలో లవ్ అనే మరో సీరియల్‌లో కూడా నటించింది