ఆ జానర్‌లో ట్రెండ్ సెట్టర్‌గా రంగస్థలం..
29 January
202
5
Prudvi Battula
సినిమా అంటే సిటీలోనే అని ఫిక్సైన స్టార్ హీరోలను గ్రామాల వైపు అడుగులు వేసేలా చేసిన సినిమా రామ్ చరణ్ రంగస్థలం.
90స్‌లో చిరంజీవి, బాలయ్య, వెంకీ, నాగార్జున లాంటి హీరోలంతా పక్కా విలేజ్ బ్యాక్‌డ్రాప్ సినిమాలు చేసారు.
కానీ ఆ తర్వాత జనరేషన్ పూర్తిగా అలాంటి సినిమాలకు దూరమైపోయారు. మళ్లీ దానికి ఊపిరి పోసింది మాత్రం రామ్ చరణే.
2018లో వచ్చిన రంగస్థలం ఓ ట్రెండ్ సెట్టర్. అప్పటి వరకు ఉన్న తెలుగు సినిమా దారిని మార్చేసిన సినిమా ఇది.
చాలా ఏళ్ళ తర్వాత ఓ స్టార్ డైరెక్టర్, స్టార్ హీరో కాంబినేషన్‌లో వచ్చిన ప్రాపర్ విలేజ్ బ్యాక్‌డ్రాప్ సినిమా ఇది.
రామ్ చరణ్ రంగస్థలం మూవీ సృష్టించిన సంచలనం చూసాక.. తెలుగులో ఆ తరహా సినిమాలు రావడం మరింత ఎక్కువైపోయింది.
దీనికి ముందే శతమానం భవతి కూడా పూర్తిగా ఊళ్లో జరిగే కథ. దాంతో పాటు ఆర్ఎక్స్ 100 కూడా పూర్తిగా ఒకే ఊళ్ళో జరుగుతుంది.
అయితే స్టార్ పవర్ లేక.. అక్కడికే ఆ కథలు పరిమితం అయిపోయాయి. కానీ రంగస్థలం సినిమా తర్వాత సీన్ మారిపోయింది.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఈ ఫిల్మ్ స్టూడియోస్ ప్రపంచంలోనే అతి పెద్దవి..
బాలయ్య పక్కన లీడ్ రోల్.. అవకాశాలు మాత్రం నిల్.. ఎవరా భామలు.?
ప్రపంచంలోనే భారీ వసూళ్లతో సత్తా చాటిన టాప్ 10 సినిమాలు..