రామాయణం సినిమాకు రణబీర్ రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
TV9 Telugu
09 April 2024
డైరెక్టర్ నితిష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న రామాయణం మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే స్టార్ట్ అయ్యింది.
కానీ ఇప్పటివరకు ఈ మూవీ గురించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కేవలం ఫస్ట్ డే షూటింగ్ ఫోటోస్ లీక్ కావడ
ంతో రామాయణం పై ఓ స్పష్టత వచ్చింది.
ఈ చిత్రాన్ని మొత్తం మూడు భాగాలుగా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఫస్ట్ పార్టులో కేవలం రాముడు, సీత గురించి మాత్రమే ఉంటుందని అంటున్నారు.
ఇందులో రాముడి పాత్రలో బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, సీత పాత్రలో న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి నటించనున్నారు.
అలాగే కన్నడ హీరో యష్ రావణుడిగా.. ఆంజనేయుడి పాత్రలో సన్నీ డియోల్, శూర్ఫణఖగా రకుల్ కనిపించనుందని టాక్ వినిపిస్తుంది.
అయితే ఇప్పుడు రాముడిగా కనిపించేందుకు రణబీర్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ గురించి పలు ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి.
తాజాగా సమాచారం ప్రకారం ఈసినిమాలో రాముడి పాత్రలో నటించేందుకు రణబీర్ రూ. 75 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇక్కడ క్లిక్ చేయండి