రిలీజ్ అయి ఇన్ని రోజులు అవుతున్నా సందీప్ వంగ యానిమల్ సినిమాకు సంబంధించి ఏదో ఒక వార్త ట్రెండ్ అవుతూనే ఉంది.
తాజాగా ఆడియో పరంగా ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేసింది ఈ మూవీ. స్పాటిఫైలో 50 కోట్ల సార్లకు పైగా స్ట్రీమింగ్ అయ్యింది యానిమల్ ఆల్బమ్.
ఇంత వేగంగా స్పాటిఫైలో యాప్ లో ఈ రికార్డ్ సాధించిన ఇండియన్ మూవీ యానిమలే కావటం విశేషం అని తెలిపారు మేకర్స్.
అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న పుష్ప2 సెట్స్ నుంచి ఓ పిక్‌ను షేర్ చేశారు రష్మిక. సింహం బొమ్మను ఆనుకుని ఉన్న కెప్టెన్ సుకుమార్ ఫొటోను షేర్ చేశారు.
ప్రస్తుతం పుష్ప2కి సంబంధించిన కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు సుకుమార్. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప2 ఆగస్టు 15న విడుదల కానుంది పుష్ప2.
నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీ రాబిన్‌హుడ్. ఇది దర్శకునికి హ్యాట్రిక్ చిత్రం.
పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు సంబంధించిన మరో ఇంట్రస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది.
ఈ సినిమాలో కీలక పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ నటిస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.