18 December 2023

ప్రపంచ వ్యాప్తంగా ఏకైక వెబ్ సీరిస్ రానా నాయుడా మజాకా.!

రానా నాయుడు.. సూపర్ డూపర్ హిట్టైన వెబ్ సీరస్.! దాంతో పాటే కాంట్రవర్సీ క్రియేట్ చేసిన వెబ్ సిరీస్‌.

అలాంటి ఈ వెబ్‌ సిరీస్‌ ఇప్పుడు వరల్డ్‌ వైడ్ రికార్డ్‌ కొట్టింది. నెట్‌ఫ్లిక్స్  ర్యాకింగుల్లో ఏకైక ఇండియన్ వెబ్ సిరీస్‌గా నిలిచింది.

దీంతో మరో సారి నెట్టింట ఈ సిరీస్‌ హాట్ టాపిక్ అవుతోంది.

మరికొన్ని రోజుల్లో 2023 ముగియనండడం ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ ఫ్లిక్స్‌ వార్షిక జాబితా విడుదల చేసింది. 

అయితే ఈ జాబితాలో టాప్‌-10లో ఒక్క భారతీయ సినిమా కానీ లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

అయితే తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న వెంకీ మామ రానా నాయుడు వెబ్‌ సిరీస్‌ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ వ్యూస్‌ సాధించిన టాప్‌ -400లో స్థానం దక్కించుకుంది.

ఈ లిస్టులో 336వ స్థానంలో నిలిచిన రానా నాయుడు.. ఇండియా నుండి చోటు దక్కించుకున్న ఏకైక వెబ్ సిరీస్ గా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

అంతేకాదు ఈ సిరీస్ కు 46 మిలియన్ల గంటలు వైవర్షిప్ వచ్చినట్లు సంస్థ తెలిపింది నెట్ ఫ్లిక్స్ .