15 September 2025
రమ్యకృష్ణ ఆస్తులు ఎన్ని కోట్లు ఉన్నాయో తెలుసా.. ?
Rajitha Chanti
Pic credit - Instagram
దక్షిణాదిలో అద్భుతమైన హీరోయిన్లలో రమ్యకృష్ణ ఒకరు. 90వ దశకంలో అందం, అభినయంతో కట్టిపడేసింది.
1967 సెప్టెంబర్ 15న చెన్నైలో జన్మించింది. 1990 నుంచి 2000 వరకు దశాబ్దకాలం సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పింది.
తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషలలో స్టార్ హీరోస్ అందరితో కలిసి సినిమాల్లో నటించి తనదైన ముద్రవేసింది.
మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జున, రాజశేఖర్, మోహన్ బాబు వంటి స్టార్ హీరోలతో కలిసి నటించి మెప్పించింది.
ఇప్పటికీ సినిమాల్లో సహయ నటిగా అలరిస్తుంది. దాదాపు 30 ఏళ్లలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది.
నివేదికల ప్రకారం రమ్యకృష్ణ ఆస్తుల వివరాలు రూ.90 కోట్లు. అలాగే ఇప్పుడు అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్ ఆమె. 8
ఒక్కో సినిమాకు రూ. 4 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుంది. అలాగే వాణిజ్య ప్రకటనలతోనూ భారీగానే సంపాదిస్తుంది.
టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కృష్ణవంశీ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఒక బాబు జన్మించారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్