చెర్రీ అలా ఎందుకన్నారు?

TV9 Telugu

10 March 2024

ఉపాసన ఎన్నో మంచి పనులు చేస్తుందని తన సతీమణి గురించి కొన్ని విషయాలు పంచుకున్నారు స్టార్ హీరో రామ్‌చరణ్‌.

ఆమె చేసే మంచి పనులే ఆమెను మరో స్థాయిలో ఉంచాయని తన భార్య ఉపాసనను పొగిడారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.

కేవలం తన భార్య కావడం వల్లనే ఆమెకు గుర్తింపు వచ్చిందనుకుంటే పొరపాటేనని తాజాగా ఓ ఇంటర్వ్యూలో అన్నారు ఆయన.

కుటుంబ విలువలను ఆమె గౌరవించే తీరు చూస్తే ఎంతగానో ముచ్చటేస్తుందని చెప్పారు పాన్ ఇండియా స్టార్ చెర్రీ.

వారసత్వాన్ని అందంగా ముందుకు తీసుకు వెళ్తోందని తన సతీమణి ఉపాసన కొణిదెలను ప్రశంసించారు టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్.

ప్రతి మగవాడి విజయం వెనుక ఓ స్త్రీ ఉన్నట్టు, ప్రతి స్త్రీ విజయం వెనుక ఓ పురుషుడు ఉండాలని ఉపాసన అభిప్రాయపడ్డారు.

తాను చరణ్‌ ఇంట్లో అడుగుపెట్టినప్పుడు, అక్కడి వాతావరణం పూర్తిగా కొత్తగా అనిపించిందని అన్నారు మెగా కోడలు ఉపాసన.

చెర్రీ, తాను కలిసి ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. ప్రతి విషయంలోనూ మిస్టర్‌ సీ సపోర్ట్ చేస్తుంటారని చెప్పారు.