RC16 నుంచి క్రేజీ అప్‌డేట్.. ట్రెండింగ్ తండేల్‌ టీజర్‌..

TV9 Telugu

08 January 2024

పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ హీరోగా చేస్తున్న నెక్ట్స్ మూవీకి సంబంధించి కీలక అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్‌.

బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు లెజెండరీ మ్యూజిక్‌ డైరెక్టర్ ఏ ఆర్‌ రెహమాన్ సంగీతమందిస్తున్నట్టుగా వెల్లడించారు.

శనివారం ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ పుట్టిన రోజు సందర్భంగా ఈ ప్రకటన చేశారు RC16 మూవీ మేకర్స్.

ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గేమ్‌ చేంజర్ వర్క్‌లో బిజీగా ఉన్నారు చెర్రీ.

యువ సామ్రాట్ నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న తొలి పాన్ ఇండియా మూవీ తండేల్‌. ఇందులో సాయి పల్లవి హీరోయిన్‌.

చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న తండేల్ సినిమా నుంచి తాజాగా టీజర్‌ను విడుదల చేశారు మూవీ మేకర్స్‌.

శనివారం రిలీజ్ అయిన ఈ టీజర్‌ ఆకట్టుకొనేలా ఉంది. ప్రస్తుతం ఇది యూట్యూబ్ లో టాప్‌ లో ట్రెండ్ అవుతోంది.

మత్య్సకారుల నేపథ్యంలో తెరకెక్కుతున్న తండేల్ సినిమాలో మాస్ లుక్‌లో కనిపిస్తున్నారు యువ సామ్రాట్ నాగ చైతన్య.