స్టూడెంట్ లీడర్ గా సూర్య.. ఆహ్వానం అందుకున్న సీతా రాములు..

09 December 2023

ప్రస్తుతం కంగువతో బిజీగా ఉన్నారు హీరో సూర్య, తర్వాత సుధా కొంగరతో ఓ సినిమాకు ఓకే చెప్పిన విషయం తెలిసిందే.

ఆ సినిమాను కూడా జై భీమ్‌ తరహాలో కొన్ని రియల్‌ ఇన్సిడెంట్స్ ఆధారంగా తీసుకొని ప్లాన్ చేస్తోంది చిత్ర యూనిట్.

1965 సంవత్సరంలో హిందీ భాషకు వ్యతిరేకంగా జరిగిన ఓ ఉద్యమం నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు సుధ.

ఈ చిత్రంలో సూర్య ఓ స్టూడెంట్ లీడర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యలో మోదీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రామమందిర ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది.

ఇప్పటికే ప్రముఖులకు అయోధ్య రామమందిర ప్రారంబోత్సవానికి ఆహ్వాన పత్రికలు కూడా పంపుతున్నారు రామ మందిర నిర్వాహకులు.

ఈ నేపథ్యంలో అమితాబ్ బచ్చన్‌తో పాటు రామాయణం టీవీ సీరియల్‌తో పాపులర్ అయిన నటులకు కూడా ఆహ్వానాలు అందాయి.

రాముడిగా నటించిన అరుణ్ గోవిల్‌, సీత పాత్రలో నటించిన దీపికా చిక్లియాకు మందిర ప్రారంభోత్సవ ప్రత్యేక ఆహ్వానం అందింది.