సపోర్ట్ చేస్తున్నట్టే చేస్తూ... ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్
01 October 2023
తన మాటలతో.. తన ట్వీట్లో ఎప్పుడూ వివాదాలకు దగ్గరగా ఉండే ఆర్జీవీ.. ఈసారి కాస్త డిఫరెంట్గా ట్వీట్ చేశారు.
వివాదాలే లేకుండా.. ఎవర్నీ కించపరచకుండా... మహిళల పక్షాన ట్వీట్ చేసినట్టే చేశారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.
అందులోనూ.. ఏపీ మంత్రి రోజాపై.. టీడీపీ నేత బండారు సత్యనారాయణ చేసిన దిగజారుడు కామెంట్స్ పై రియాక్టయ్యారు.
బండారు చేసిన వ్యాఖ్యలు.. ఒక్క రోజానే కాదు.. మహిళలందర్నీ అవమానించడమే అంటూ.. వర్మ సెటైరికల్‌గా తన ట్వీట్లో రాసుకొచ్చారు.
ప్రెస్ మీట్లో.. బండారు మాట్లాడిన మాటల వీడియో లింకును కూడా తన ట్వీట్లో షేర్ చేశారు రామ్ గోపాల్ వర్మ.
మంత్రి హోదాలో ఉన్న మహిళకే ఈ పరిస్థితి ఉంటే ఇక మామూలు స్త్రీల పరిస్థితి ఏంటి?? ఏపీ ఉమెన్స్ కమిషన్‌ను ప్రశ్నించారు.
ఆ కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ తన ప్రశ్నకు సమాధానం చెప్పాలంటూ.. తన ట్వీట్లో డిమాండ్ చేశారు ఆర్జీవీ.
ఇలా.. ఏపీ పాలిటిక్స్‌ను.. దూరం నుంచి చూస్తూ.. సోషల్ మీడియా వేదికగా సెటైరికల్ ట్వీట్స్ చేస్తూ.. నెట్టింట వర్మ నెట్టింట వైరల్ అవుతున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి