వైజాగ్ బీచ్ లో క్లీంకార, ఉపాసనతో రామ్ చరణ్ షికారు...

TV9 Telugu

21 March 2024

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యామిలీతో కలిసి వైజాగ్‌ బీచ్‌లో సందడి చేశారు. తమ కూతురు క్లీంకారాతో కలిసి రామ్‌చరణ్‌ దంపతులు బీచ్‌ను సందర్శించారు.

రోబో ఫేమ్‌ శంకర్ డైరెక్షన్ లో రామ్‌చరణ్‌ నటిస్తున్న గేమ్ చేంజర్ చిత్రం షూటింగ్ తాజాగా విశాఖలో జరుగుతోంది.

ఉదయాన్నే తన కుటుంబంతో కలిసి బీచ్ కు వచ్చిన రామ్ చరణ్ అలల తాకిడి సౌందర్యాన్ని సూర్యోదయాన్ని ఆస్వాదించారు.

క్లీంకారకు కూడా సముద్రపు అలలను పరిచయం చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఉపాసన ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నారు.

స్థానిక మత్స్యకారులతో మాట్లాడిన రామ్ చరణ్ వారు పట్టుకొచ్చిన చేపలను ఆసక్తిగా పరిశీలించారు. పెంపుడు కుక్క పూడుల్స్ ను వెంట తీసుకువచ్చారు.

వైజాగ్ వచ్చిన రామ్ చరణ్ కు అభిమానుల నుంచి తాకిడి మామూలుగా లేదు. రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా అభిమానులు పోటెత్తుతున్నారు.

గేమ్ ఛేంజర్‌ తర్వాత ఉప్పెన ఫేమ్‌ దర్శకుడు బుచ్చిబాబు సనా దర్శకత్వంలో RC 16లో నటించనున్నారు రామ్‌చరణ్‌.