బిజినెస్‌మేన్‌గా చెర్రీ.. యాక్షన్ రోల్‌లో త్రిష..
26 December 2023
TV9 Telugu
సినిమాలతో పాటు బిజినెస్‌మేన్‌గానూ దూసుకుపోతున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. తాజాగా ఓ క్రికెట్ టీమ్‌ను కొనుగోలు చేశారు చెర్రీ.
ఐఎస్‌పీఎల్ టోర్నీలో హైదరాబాద్ జట్టును సొంతం చేసుకున్నారు మెగా పవర్ స్టార్. ఈ టీమ్‌లో పాల్గొనేందుకు ఆటగాళ్లును ఆహ్వానిస్తూ ఓ ప్రకటన చేశారు.
విద్యుత్ జమ్వాల్ హీరోగా అమీ జాక్సన్ కథానాయకిగా తెరకెక్కుతున్న తాజా యాక్షన్ థ్రిల్లర్ మూవీ క్రాక్.
ఆదిత్య దత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది చిత్రయూనిట్.
అర్జున్ రామ్‌పాల్, నోరా ఫతేహి కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 23న ప్రేక్షకుల ముందుకు రానుంది.
వరుస విజయాలతో సూపర్ ఫామ్‌లో ఉన్న సీనియర్ హీరోయిన్ త్రిష, ఓ మాలీవుడ్ మూవీలో యాక్షన్ రోల్‌లో నటిస్తున్నారు.
టొవీనో థామస్ లీడ్ రోల్‌లో తెరకెక్కుతున్న ఐడెంటిటీ అనే మలయాళీ యాక్షన్ సినిమాలో నటిస్తున్నారు ఈ బ్యూటీ.
ఇటీవల ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొన్న చెన్నై చంద్రం, త్రిష ఉన్న ఆ వీడియోను తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేశారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి