TV9 Telugu

రామ్ చరణ్‌ నయా లుక్‌.. బాఫ్టా స్టేజ్ మీదకు దీపిక..

15 Febraury 2024

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గేమ్ చేంజర్ సినిమా కోసం మరో డిఫరెంట్ లుక్‌లో మేకోవర్ అయ్యారు రామ్ చరణ్‌.

ఇప్పటికే వింటేజ్‌ గెటప్‌తో పాటు, స్టైలిష్ లుక్స్‌లో షూటింగ్ చేసిన చెర్రీ ఇప్పుడు రాక్‌ స్టార్‌గా మారిపోయారు.

డిఫరెంట్ హెయిర్‌ స్టైల్‌తో స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న శింబు, త్వరలో ఓ డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు.

STR 48 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమలో హీరోగా, విలన్‌గా ద్విపాత్రాభినయం చేస్తున్నారు శింబు.

ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించటంతో పాటు ఓ గెస్ట్‌ రోల్‌లోనూ నటిస్తున్నారు ఉలగనయగన్ కమల్‌ హాసన్‌.

గత ఏడాది ఆస్కార్ వేదిక మీద ప్రెజెంటర్‌గా మెరిసిన దీపికా పదుకోన్‌, ఈ ఏడాది బాఫ్టా స్టేజ్ మీద కూడా ప్రెజెంట్‌గా కనిపించబోతున్నారు.

ఈ ఆదివారం లండన్‌లోని ది రాయల్ ఫెస్టివల్‌ హాల్‌లో ఈ వేడుక జరగనుంది. ప్రస్తతం దీపిక పదుకోన్‌ కల్కి 2898 ఏడీలో ప్రభాస్‌కు జోడిగా నటిస్తున్నారు.