రామ్ చరణ్ కూతురికి పెట్టాలనుకున్న పేరు ఇదేనా ??
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులు తల్లిదండ్రులుగా మారిన విషయం మనకు తెలిసిందే.
జూన్ 20వ తేదీ రామ్ చరణ్ ఉపాసన దంపతులకు పండంటి ఆడబిడ్డ జన్మించారు.
ఇక ఉపాసన డిశ్చార్జ్ అయిన సందర్భంగా రామ్ చరణ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాస్త ఎమోషనల్ అయ్యారు.
ఉపాసన నేను కూడా పాపకు ఏ పేరు పెట్టాలి అనే విషయం గురించి ఫిక్స్ అయ్యామంటూ తెలియజేశారు
పాపకు 21వ రోజు ఆ పేరును రివిల్ చేస్తామని తెలియజేశారు.
ఈ క్రమంలోనే రామ్ చరణ్ తన కూతురికి ఏ పేరు పెట్టబోతున్నారనే విషయం గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
మెగాస్టార్ ఫ్యామిలీ అందరూ కూడా ఆంజనేయ స్వామికి భక్తులు అనే విషయం మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే మరోసారి రామ్ చరణ్ దంపతులు తమ కుమార్తెకు ఆంజనేయ స్వామి పేరు కలిసి వచ్చే విధంగానే పెట్టాలని భావించారట.
ఇలా తమ సెంటిమెంట్ ప్రకారం తమ చిన్నారికి అంజలి అనే పేరును పెట్టాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇక్కడ క్లిక్ చేయండి