రామ్ చరణ్ ఫేవరెట్ హీరో, హీరోయిన్లు ఎవరో తెలుసా? అసలు ఊహించలేరు
TV9 Telugu
26 August 2024
ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ సినిమాతో బిజీగా ఉన్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఎస్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది.
దీంతో పాటు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబుతో ఓ సినిమా చేస్తున్నాడు రామ్ చరణ్. ‘ఆర్‌సీ 16’ పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్.
కాగా ఇటీవల మెల్ బోర్న్ ఫిల్మ్ ఫెస్టివల్ కోసం ఆస్ట్రేలియా వెళ్లి వచ్చాడు రామ్ చరణ్. అక్కడ అతనికి అభిమానుల నుంచి సాదర స్వాగతం లభించింది.
కాగా ఆస్ట్రేలియా పర్యటన నుంచి హైదరాబాద్ కు తిరిగొచ్చిన రామ్ చరణ్ ఇటీవల ఒక జాతీయ మీడియా ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు.
ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ర్యాపిడ్ ఫైర్‌లో పలు ప్రశ్నలు అడగ్గా... రామ్ చరణ్ ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు.
తనకు బాగా ఇష్టమైన సినిమా మగధీర అని చెప్పారు చెర్రీ. ఆరెంజ్, రంగస్థలం చిత్రాలంటే తనకు ఇష్టమని.. కానీ మగధీర తన ల్యాండ్‌మార్క్ మూవీ అన్నారు.
మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరనే ప్రశ్నకు.. రామ్ చరణ్ కొద్ది సేపు ఆలోచించారు. ఆ వెంటనే నేటి తరం హీరోయిన్స్‌లో మాత్రం సమంత అంటే ఇష్టమన్నారు
ఇదే సందర్భంగా మీకు ఇష్టమైన హీరో పేరు అడగ్గా.. ఏ మాత్రం ఆలోచించకుండా కోలీవుడ్ స్టార్ సూర్య పేరు చెప్పుకొచ్చారు రామ్ చరణ్ .
ఇక్కడ క్లిక్ చేయండి..