12 April 2024

ఇకపై డా.రామ్ చరణ్. వెల్స్ యూనివర్సిటీ నుంచి చరణ్‏కు గౌరవ డాక్టరేట్.. 

Rajitha Chanti

Pic credit - Instagram

అద్భుతమైన సినిమాలతో తెలుగు సినీ పరిశ్రమలో తనదైన గుర్తింపు సంపాదించుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ట్రిపుల్ ఆర్ తర్వాత గ్లోబల్ స్టార్ అయ్యాడు. 

ఇప్పటివరకు ఎన్నో రికార్డులను ఖాతాలో వేసుకున్ని ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్నాడు. అద్భుతాలను సృష్టించిన చరణ్ కీర్తి కిరీటంలో ఇప్పుడు మరో డైమండ్ చేరింది.

చెన్నైకు చెందిన వేల్స్ యూనివ‌ర్సిటీ చరణ్‏కు గౌర‌వ డాక్ట‌రేట్‌ను అందిస్తోంది. గతేడాది ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ‌న్‌, డైరెక్టర్ శంకర్ డాక్టరేట్ అందుకున్నారు. 

సినీ పరిశ్రమలో ఆయన చేసిన సేవలకుగానూ  ఈ గౌరవాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. తొలి సినిమా నుంచి ఇప్పుడు గ్లోబ‌ల్ స్టార్ ఇమేజ్ వరకు ప్రతిభ చూపించారు. 

ఏప్రిల్ 13న చెన్నైలో జరగనున్న వెల్ల్ యూనివర్సిటీ స్నాతకోత్సం వేడుకలో రామ్ చ‌ర‌ణ్‌, డా.పి.వీర‌ముత్తువేల్, డా.జి.ఎస్‌.కెవేలు, అచంట శ‌ర‌త్ క‌మ‌ల్  గౌరవించనున్నారు.

త‌మ అభిమాన హీరోకు ద‌క్కిన గౌర‌వంపై రామ్‌చ‌ర‌ణ్ అభిమానులు ఎంతో సంతోషంగా ఉన్నారు. సోష‌ల్ మీడియాలో అయితే ఈ వార్త తెగ వైర‌ల్ అవుతుంది. 

ప్రస్తుతం చరణ్ గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నారు. డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుండగా.. అంజలి కూడా నటిస్తుంది. 

ఈ సినిమా తర్వాత డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు. ఇటీవలే ఈ మూవీ పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభమైన సంగతి తెలిసిందే.