TV9 Telugu

03 February 2024

రామ్ చరణ్ బంపర్ ఛాన్స్‌.. మిస్‌ అయితే ఫీలవుతారు.!

గేమ్‌ ఛేంజర్ తర్వాత మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ఉప్పెన ఫేమ్‌ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు.

RC16 వర్కింగ్ టైటిల్‌తో పాన్‌ ఇండియా స్థాయిలో ఈ మూవీ తెరకెక్కనుంది. త్వరలోనే ఈ మూవీ షూటింగ్‌ ప్రారంభకానుంది.

ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్‌ వర్స్క్‌ శరవేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉంటె RC16 ప్రాజెక్ట్‌ కోసం టాలెంట్‌ హంట్‌ నిర్వహించనున్నారు.

RC 16 మూవీ కోసం ఉత్తరాంధ్రలో టాలెంట్ హంట్ నిర్వహించబోతున్నట్లు చిత్రబృందం సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.

దీని ప్రకారం పురుషులు, స్త్రీలతో పాటు ఛైల్డ్‌ ఆర్టిస్టులు కూడా ఈ ట్యాలెంట్‌ హంట్‌లో పాల్గొనవచ్చు.

ఫిబ్రవరి 8 నుంచి 17వ తారీఖు వరకు షెడ్యూల్ ప్రకారం ప్రతి రోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆడిషన్స్‌ జరుగుతాయి.

సుమారు 400 మంది నటీనటులను ఈ ట్యాలెంట్‌ హంట్‌ ద్వారా ఎంపికచేయనున్నారు మేకర్స్‌.

ఉత్తరాంధ్రలో జరిగే సినిమా కాబట్టి. ఉత్తరాంధ్ర స్లాంగ్‌లో అనర్గళంగా డైలాగ్స్ చెప్పగల నటీనటులు అవసరం అవుతుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం.. ప్రీపేర్ అవ్వండి.. క్రాక్ చేయండి.. మెగా పవర్ స్టార్ చెర్రీ సినిమాలో ఆఫర్ కొట్టేయండి.