రామ్ చరణ్ గురించి ఇది తెలుసా.?

TV9 Telugu

24 May 2024

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఏకంగా గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు చెర్రీ.

 అందుకే సోషల్ మీడియాలో నిరంతరం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి సంబంధించిన వార్తలు ఏదో ఒకటి ట్రెండ్ అవుతూనే ఉంటాయి.

దిలా ఉంటే ఇటీవల రామ్‌ చరణ్  వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక విషయం తెగ వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే..

పద్మ విభూషణ్ అవార్డు స్వీకరించేందుకు చిరంజీవి కుటుంబ సభ్యులందరూ ఢిల్లీ వెళ్లారు. రామ్ చరణ్- ఉపాసన కూడా వీరి వెంట ఉన్నారు.

ఈ క్రమంలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేతిలో ఉన్న మొబైల్ వాల్ పేపర్ ఫొటో మీడియా కంటపడింది. అంతే ఇక ఆ న్యూస్ వైరలైంది.

సాధారణంగా చాలామంది తమ మొబైల్ వాల్ పేపర్ ని తమ ఫోటో.. భార్య ఫోటో, తల్లిదండ్రులు లేదాపిల్లలు ఫోటో పెట్టుకుంటూ ఉంటారు.

అయితే హనుమంతిడిని బాగా ఆరాధించే రామ్ చరణ్ ఆంజనేయ స్వామి ఫోటోని మొబైల్ వాల్ పేపర్ గా పెట్టుకున్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్‌ చేంజర్ అనే సినిమాలో నటిస్తున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.